జిల్లాలో నెలకొన్న డీజిల్ సమస్యపై ఆయిల్ కంపెనీలతో మాట్లాడామని, సోమవారం రాత్రి 7 గంటల నాటికి అన్ని బంకుల్లోనూ ఇంధనం అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఎస్పీ రాహుల్ మీనా, జేసీ వైఖోమ నిధియాదేవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 3 గంటలకే 60 శాతం బంకుల్లో సరఫరా మొదలవుతుందని, ఈ ప్రక్రియను జేసీ, డీఎస్పీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు.