అమలాపురం రూరల్ మండలం కామనగరువు గ్రామానికి చెందిన కుంచె శాంతమ్మ మరియు వాసంశెట్టి పెద్ది రాజు కుటుంబాలు సర్వం కోల్పోయారు. వారికి సోమవారం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వంట సామాగ్రి, టార్పాలిన్, రగ్గు, బియ్యం, కూరగాయలు, బట్టలు, అందించారు.