కోనసీమ: ప్లాస్మా టెక్నాలజీతో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం

అమలాపురం డంపింగ్ యార్డ్‌లో ప్లాస్మా టెక్నాలజీతో ఏర్పాటు చేసిన వ్యర్థాల నిర్వహణ యూనిట్ ట్రయల్ రన్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. ఈ టెక్నాలజీ ద్వారా 850-1500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తడి, పొడి, బయో మెడికల్ వ్యర్థాలను 95% బూడిదగా మార్చవచ్చని, దీనివల్ల విషవాయువులు వెలువడవని, డంపింగ్ యార్డుల అవసరం తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. రోజుకు 10 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసే ఈ యూనిట్ పర్యావరణహితమైనదని, చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్