అమలాపురంలో మంగళవారం, పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణరాజు నూతన పోస్టల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీకర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జిల్లాలోని పోస్టల్ కార్యాలయాలు ప్రగతి పథంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్న అమలాపురం పోస్టల్ ఎస్పీ కార్యాలయాన్ని, నూతన ఎస్పీ హయాంలో రాష్ట్రంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్లాలని రుద్రరాజు కోరారు.