అమలాపురంలో నేడు విద్యుత్ నిలిపివేత

అమలాపురం పట్టణంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో, శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈఈ రాంబాబు శుక్రవారం తెలిపారు. ఈదరపల్లి నుండి మెయిన్ రోడ్డు, గడియార స్తంభం వరకు, సీతాపతిరావుపేట, మున్సిపల్ కాలనీ, వెజ్ మార్కెట్, హనుమాన్ థియేటర్ రోడ్డు, నారాయణపేట, ప్రకాశం వీధి, ప్రభాకర్ నగర్, వడ్డిగూడెం, బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్