ఉప్పలగుప్తం ఉపకేంద్రం పరిధిలో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనుల కారణంగా సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చినగాడవిల్లి, పెదగాడవిల్లి, మునిపల్లి, వానపల్లిపాలెం గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ కె. రాంబాబు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.