అమలాపురంలో గురువారం జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్‌ను సరిదిద్దడం, హెల్మెట్ ధారణను ప్రోత్సహించడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 'గోల్డెన్ అవర్'లో వైద్యం అందేలా చూడాలని, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను కోరారు.