రెవెన్యూ సేవల్లో వేగం పెంచాలి: కోనసీమ కలెక్టర్

అమలాపురం: జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగంగా అందించాలని ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా గ్రామ స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించాలని, మ్యూటేషన్లు, పాస్ పుస్తకాల తప్పుల సవరణను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి, డిజిటల్ రిజిస్టరీ ద్వారా భూ రికార్డులను ఆధునీకరించాలని, అర్హులైన వారికి కుల ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందజేయాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్