కోనసీమ ప్రజానీకానికి ఎస్పీ రాహుల్ మీనా కీలక సూచనలు

కోనసీమ ప్రజానీకానికి జిల్లా ఎస్పీ రాహుల్ మీనా బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. రోడ్లపై ఇతరులకు ఇబ్బంది కలిగించే వారిపై, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ కేకులు కట్ చేసేవారిపై, సైలెన్సర్లు తీసి బైక్‌లపై తిరిగేవారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్