తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం.. కలెక్టర్

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వంద శాతం పారదర్శకమైన, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, సీఈఓ వివేక్ యాదవ్‌లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణలో మొదటి దశ ఓటర్ల మ్యాపింగ్, 2002 డేటాతో సరిపోల్చడం, టేబుల్ ఎక్సర్‌సైజ్ ప్రక్రియలను బీఎల్ఓలు పక్కాగా నిర్వహించాలన్నారు. డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్ల తొలగింపు, వలస ఓటర్ల గుర్తింపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్