ఎట్టకేలకు అప్పనపల్లి కాజ్వే పునర్నిర్మాణం ప్రారంభం

మామిడికుదురు మండలం పాసర్లపూడి ఏటిగట్టు దిగువన శిథిలమైన అప్పనపల్లి కాజ్వే పునర్నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. జేసీబీతో అప్రోచ్ రోడ్డు పనులను మొదలుపెట్టారు. పాత సిమెంట్ కట్టడాన్ని తొలగించి, నూతనంగా పటిష్టమైన వంతెన నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్