పగిలిన పైపులైన్: అప్పనపల్లి, పెదపట్నంలంకలలో నీటి ఎద్దడి

మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే నిర్మాణ పనుల సమయంలో గ్రావిటీ పైపులైన్ దెబ్బతినడంతో అప్పనపల్లి, బి. దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జేసీబీతో పనులు చేస్తున్నప్పుడు పైపులైన్ పగిలిపోవడంతో గత నాలుగు రోజులుగా స్థానికులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జయశ్రీ బుధవారం మాట్లాడుతూ, పైపులైన్ దెబ్బతిన్న మాట వాస్తవమేనని, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నామని, గురువారం నుండి తాగునీటి సరఫరా యధావిధిగా పునరుద్ధరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్