అయినవిల్లి మండలం క్రాప శంకరాయగూడెంలో పగటిపూట కూడా వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్ వృథాకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా కాలువ గట్టు రోడ్డులో నిరంతరం వెలుగుతున్న లైట్ల వల్ల పంచాయతీపై విద్యుత్ బిల్లుల భారం పెరుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యుత్ వృథాను అరికట్టేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు మంగళవారం ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.