కైకాలపేట-కొండాలమ్మ చింత.. నిలిచిన రోడ్డు పనులు

మామిడికుదురు మండలం పాసర్లపూడి కైకాలపేట నుంచి కొండాలమ్మ చింత వరకు జాతీయ రహదారి (NH-216) విస్తరణ పనులు గత నాలుగు నెలలుగా నిలిచిపోవడంతో వాహనదారులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. తవ్విన గోతుల్లో వర్షపు నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. ఎన్‌హెచ్ ఏఈ వెంకటరమణ మాట్లాడుతూ, అంతర్జాతీయంగా గల్ఫ్ యుద్ధ వాతావరణం కారణంగా బిటుమెన్ (తారు) కొరత ఏర్పడి పనులు ఆలస్యమయ్యాయని, త్వరలోనే సమస్యను పరిష్కరించి పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్