డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ: ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యల హెచ్చరిక

తూగో జిల్లా దేవరపల్లి పిహెచ్‌సిని డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, రోగుల పట్ల అజాగ్రత్త వహించవద్దని సూచించారు. జ్వరాలతో బాధపడుతున్న రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపి, అనవసర పరీక్షలు చేయించి ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తుఫాను కారణంగా జ్వరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్