తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని దేవరపల్లి రామన్నపాలెంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంగన్వాడి సెంటర్-90 సమీపంలోని ప్రధాన వీధిలో మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేక దుర్గంధం వెదజల్లుతోందని, దీనివల్ల దోమలు పెరిగి రోగాలు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీ పూడిక తీయాలని వారు కోరుతున్నారు.