గోపాలపురం: బూత్ లెవెల్ అధికారులు ఓటర్ మ్యాపింగ్ చేయాలి

గోపాలపురం మండలంలోని 51 పోలింగ్ బూత్ లలో బూత్ లెవెల్ అధికారులు ఓటర్ మ్యాపింగ్ ను చాలా జాగ్రత్తగా చేయాలని ASO జోడాల వెంకట్ శనివారం సూచించారు. మండలంలో 52 వేల మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 36,402 మందికి ఓటర్ మ్యాపింగ్ పూర్తయినప్పటికీ, ఇంకా కొన్ని తేడాలున్నాయని ఆయన తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ కేంద్రం వద్ద ఉంటూ మ్యాపింగ్ ను పూర్తి చేసి, తదుపరి కార్యక్రమాలు సఫలీకృతం అయ్యేలా కృషి చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్