సోలార్ మోడల్ విలేజ్‌గా మలకపల్లి: కలెక్టర్

బుధవారం తాళ్లపూడి మలకపల్లి గ్రామంలో 'పీఎం సూర్య ఘర్ యోజన ఉత్సవ్' జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, గ్రామం సోలార్ మోడల్ విలేజ్‌గా ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ఆమె ప్రారంభించారు. కేంద్రం నుంచి రూ.1 కోటి గ్రాంట్ మంజూరైందని, ఇది గ్రామ అభివృద్ధికి మరింత ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్