దేవరపల్లి మండలం చిన్నయిగూడెంలో కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పందించి, కొయ్యలగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. అనంతరం గాయపడిన వారి కుటుంబాలకు పదివేల రూపాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.