గోనాడలో పల్లె నిద్ర కార్యక్రమం

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, శనివారం కిర్లంపూడి మండలం గోనాడ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కిర్లంపూడి ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం, గ్రామంలో రాత్రి వేళల్లో పోలీసుల ఉనికిని పెంచి ప్రజల భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా సాగింది. మహిళలు, పిల్లల భద్రత, లైంగిక నేరాలు, డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మద్యం, జూదం, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిఘా, రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలపై పరిశీలన చేపట్టారు. గ్రామ శాంతి కమిటీ బలోపేతంపై గ్రామ పెద్దలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఐ వైఆర్‌కే, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్