నేటి నుంచి అచ్యుతాపురం రైల్వేగేటు మూసివేత

కాకినాడలోని ఎస్. అచ్యుతాపురం రైల్వేగేటు వద్ద ట్రాక్, రహదారి మరమ్మతుల కారణంగా ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు గేటును మూసివేయనున్నారు. ఈ గేటు వద్ద పట్టాలకు, రహదారికి మధ్య ఎత్తు పల్లాలు ఉండటంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించినా, సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. దీంతో వాహనదారులకు అసౌకర్యం కలగనుంది.

సంబంధిత పోస్ట్