కాకినాడ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

జూన్ 1న సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో CM పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.50కి చామవరం చేరుకుంటారు. ప్రజావేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2.10 తర్వాత లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు స్వయంగా అందజేస్తారు. అనంతరం 2.40కి పార్టీ శ్రేణులతో సమావేశమై సాయంత్రం 4.25కి ఉండవల్లికి తిరుగుపయనమవుతారని అధికారులు వివరించారు.

సంబంధిత పోస్ట్