నగర సుందరీకరణపై కమిషనర్ కఠిన హెచ్చరికలు

కాకినాడ నగరాన్ని శుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్టీవో కార్యాలయం సెంటర్, గొడారిగుంట ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, అనుమతి లేకుండా అతికించిన వాల్ పోస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగర సుందరీకరణలో భాగంగా కార్పొరేషన్ నిరంతరం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్