ఏప్రిల్ 2న కాకినాడలో గవర్నర్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏప్రిల్ 2న కాకినాడ రానున్నారు. జేఎన్టీయూ కాకినాడలో జరిగే 12వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. గురువారం ఉదయం విజయవాడ నుంచి హెలికాప్టరులో వచ్చి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని, అక్కడి నుంచి విశ్వవిద్యాలయానికి వెళతారు. కార్యక్రమం అనంతరం పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరుతారు. పర్యటనకు సంబంధించిన భద్రత, రవాణా, విద్యుత్, వైద్య, పారిశుద్య ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్