జిల్లాలో ఆగస్టు 1న ఎన్టీఆర్ భరోసా ఫించను పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండల, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరైన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ సామాజిక భద్రత కింద జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు సొమ్ము ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు.