జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు 'అన్నదాత సుఖీభవ' పథకం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. 'అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' పథకం అమలుపై గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ తన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సమీక్షించారు. పథకం అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.