కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై కలెక్టర్ శుక్రవారం స్పందించారు. ఆరోపణలు వచ్చిన చక్రవర్తి, జమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశామని తెలిపారు. ఈ నెల 9న ఒక విద్యార్థిని మెయిల్ చేసిన తర్వాత 50 మంది ఫిర్యాదులు వచ్చాయి. వాట్సాప్‌లో అసభ్య సందేశాలు, వ్యాఖ్యలు గుర్తించామని చెప్పారు.