కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్, పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) లో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 85 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి, సకాలంలో పరిష్కరించాలని ఆయన సూచించారు.