కాకినాడలోని సాంబమూర్తి నగర్ లోని పీడీఎస్ బియ్యం గోడౌన్లను పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ మాలకొండయ్య బుధవారం పరిశీలించారు. రేషన్ షాపులకు తరలిస్తున్న బియ్యం నిల్వలను తనిఖీ చేసి, సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పారదర్శకంగా పనిచేయాలని, పేదలకు నాణ్యమైన బియ్యం అందేలా చూడాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.