నేడు కలెక్టరేట్ లో యధావిధిగా పీజీఆర్ఎస్

కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో, ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. వచ్చిన అర్జీల పురోగతి మరియు ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని 1100 నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని, అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్