కాకినాడ కలెక్టరేట్ లో సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్మోహన్ శనివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్ కు రాలేనివారు meekosam. ap. gov. in వెబ్సైట్లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సూచించారు.