కాలువ ఆక్రమణలపై కఠిన చర్యలు

కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ బుధవారం మహాలక్ష్మీ నగర్ ప్రాంతంలో పర్యటించి, కాలువలను ఆక్రమించి పారిశుద్ధ్య పనులకు అంతరాయం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టారు. కాలువపై అక్రమంగా పశువుల పాక నిర్మించిన వ్యక్తికి రూ. 3 వేల జరిమానా విధించి, ఆక్రమణను వెంటనే తొలగించాలని ఆదేశించారు. డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించి, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు. నగరంలో ఆక్రమణలను ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్