కాకినాడ జిల్లాలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జేసీ అపూర్వభరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ, సర్వే అధికారులతో నిర్వహించిన సమావేశంలో, ఏడు మండలాల్లో డిజిటలైజేషన్ పూర్తయిందని, పిఠాపురం, కరప మండలాల్లో మందకొడిగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని, నీటి వనరులపై గుర్తించిన ఆక్రమణలను తొలగించి, నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, డీఆర్వో తిప్పేనాయక్, ఆర్డీవో మల్లిబాబు, సర్వేశాఖ ఏడీ శ్రీనివాస్, డీడీవో వాసుదేవరావు పాల్గొన్నారు.