కాకినాడ జిల్లాల్లో ఇంధన కొరత లేదు: జేసీ అపూర్వ భరత్

కాకినాడ జిల్లాలోని 160 పెట్రోల్ బంకుల్లో ఇంధనం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ అపూర్వ భరత్ స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన సరఫరాను పర్యవేక్షించేందుకు తహశీల్దార్లు, ఎంపీడీవోలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ బంకులోనైనా స్టాక్ లేదని సాకులు చెబితే తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్