రైస్ మిల్లుల్లో పౌరసరఫరాల శాఖ తనిఖీలు

కరప, కాకినాడ రూరల్ మండలాల్లోని పలు రైస్ మిల్లులను పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుదీర్, డీఎస్వో సత్యనారాయణ రాజు మంగళవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రికార్డుల నిర్వహణలో లోపాలు, సీఎంఆర్ బియ్యం అప్పగింతలో జాప్యం గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే మిల్లులపై కేసులు నమోదు చేస్తామని, రికార్డులు సరిగా లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్