కాకినాడ జిల్లాలో మే 1 నుంచి 30 వరకు జనగణన-2027 నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. గురువారం అధికారులతో సమీక్షించిన ఆయన, ఇంటింటికీ వెళ్లి ఎటువంటి తప్పుల్లేకుండా వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు. వివరాల నమోదులో ప్రజలందరూ గణన అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.