కాకినాడ నగర శివారు జగన్నాథపురంలో బుధవారం తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. బాలాజీచెరువు సెంటర్ వద్ద పైపులైను లీకేజీకి మరమ్మతులు చేపడుతున్నందున, ఆయా ప్రాంతాల ప్రజలు దీనిని గమనించాలని సూచించారు. అత్యవసరమైతే అదనపు ట్యాంకర్లను పంపుతామని, ప్రజలు అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు.