సమాజంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడే ఉద్యోగానికి సార్థకత, గుర్తింపు లభిస్తుందని ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్సైలు ప్రసాద్, సత్యనారాయణ, ఏఆర్ ఎస్సై మోహన్‌లను గురువారం ఆయన ఘనంగా సత్కరించారు. సుదీర్ఘ కాలం శాఖకు అంకితభావంతో పనిచేసిన వారిని కొనియాడారు.