వర్షాకాలానికి ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే నానాజీ

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థపై ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా డ్రైనేజీల పూడికతీత, నిర్వహణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్