ప్రజా సంతృప్తే లక్ష్యం: కలెక్టర్ హరేంధిర ప్రసాద్

కాకినాడ జిల్లా ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు నాణ్యంగా, ప్రజల మన్ననలు పొందేలా ఉండాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ‘పబ్లిక్ పాజిటివ్ పర్ఫార్మెన్స్’పై ప్రత్యేకంగా చర్చించారు. అన్న కాంటీన్లలో ఆహార నాణ్యత, హాస్టళ్లలో సౌకర్యాలు, పట్టణ–గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్