పీజీఆర్ఎస్‌లో 45 అర్జీలు స్వీకరించిన ఎస్పీ బిందు మాధవ్

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రజల నుంచి మొత్తం 45 అర్జీలను స్వీకరించారు. వీటిలో భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, ఫిర్యాదులు వాస్తవమని తేలితే ఏడు రోజుల్లోగా పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. అనంతరం చేపట్టిన చర్యల వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్