ఏలేశ్వరం మండలంలో పులి సంచరిస్తోందన్న వార్తలను ఫారెస్ట్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్ ఖండించారు. మర్రివీడు గ్రామస్థులు ఆందోళన చెందవద్దని, రేడియో కాలర్ డేటా ప్రకారం పులి ప్రస్తుతం అడ్డతీగల మండలం తిమ్మాపురం అటవీ ప్రాంతంలో ఉందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు పేర్కొన్నారు.