కొత్తపేట ఏఎంసీ డైరెక్టర్ దుర్గా భవానికి ఘన సన్మానం

కొత్తపేట ఏఎంసీ డైరెక్టర్‌గా నియమితులైన దుర్గా భవానిని మంగళవారం ఆమె స్వగృహమైన ర్యాలిలో గౌడ సంఘం నేతలు ఘనంగా సత్కరించారు. ఆమెను పూలమాలలు, దుశ్శాలువతో సన్మానించి, కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంకర రామకృష్ణ గౌడ, మండపేట బీసీ సంఘం కార్యదర్శి తీగిరెడ్డి మహేష్ గౌడ, మార్గాన్ని శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్