కొత్తపేటలో బంకులను తనిఖీ చేసిన ఆర్డీఓ

కొత్తపేటలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతుల నేపథ్యంలో, ఆర్‌డీఓ జి. మమ్మీ ఆదివారం స్థానిక పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించిన ఆమె, బంకుల్లో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వినియోగదారులందరికీ సమాన ప్రాతిపదికన ఇంధనాన్ని విక్రయించాలని బంక్ నిర్వాహకులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు, వాహనదారులు అధికారులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్