కండ్రిగలో పైప్‌లైన్ లీకేజీలతో రోడ్లపాలవుతున్న జలాలు

కొత్తపేట మండలం కండ్రిగ పంచాయతీలో తాగునీటి పైప్‌లైన్ల లీకేజీల వల్ల నీరు భారీగా వృథా అవుతోంది. శనివారం కండ్రిగ కాలనీలోని వినాయకుడి గుడి సమీపంలో ప్రధాన పైప్‌లైన్‌కు పెద్ద ఎత్తున లీకేజీ ఏర్పడటంతో నీరు రోడ్లపాలై స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఇప్పటికే నీటి కొరత ఉన్న తరుణంలో, ఇలాంటి లీకేజీల వల్ల సమస్య మరింత జటిలమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి లీకేజీలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్