తూ. గో జిల్లాలో ఇంధన సరఫరా పూర్తిగా సాధారణం

తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. కొవ్వూరులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌తో పాటు దేవరపల్లి, గౌరీపట్నం ప్రాంతాల్లో కలెక్టర్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, సహాయ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మలతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇంధన సరఫరాపై ప్రజలు ఎటువంటి అపోహలకు తావివ్వాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్