కొవ్వూరు ఎంపీడీఓ పదవీ విరమణ కార్యక్రమంలోపాల్గొన్న ఎమ్మెల్యే

కొవ్వూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం ఎంపీడీఓ తోటా భక్త వెంకట రమణ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని, తోటా భక్త వెంకట రమణను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ సేవలో ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావంతో పనిచేసి, ప్రజలకు, గ్రామీణాభివృద్ధికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.

సంబంధిత పోస్ట్