తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో పాలకవర్గం పదవీ కాలం పూర్తయిన సందర్భంగా గురువారం అభినందన సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు గ్రామానికి చేసిన సేవలను కొనియాడుతూ, అభివృద్ధిలో రాష్టంలోనే ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.