స్వాధీన పీడీఎస్ బియ్యం ఫిబ్రవరి 12న బహిరంగ వేలం

రాజమండ్రి, కొవ్వూరు డివిజన్లలో నిత్యావసర వస్తువుల చట్టం 1955 క్రింద 6-A కేసులలో స్వాధీనపరచుకున్న 3,335.83 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యానికి ఈనెల 12న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి ఆదివారం తెలిపారు. ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశాల మేరకు పౌర సరఫరాలు కార్యాలయం వద్ద ఈ వేలం జరుగుతుంది. ఆసక్తి గలవారు 11వ తేదీన బియ్యాన్ని పరిశీలించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్