ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. కలెక్టర్

ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కారం చేయాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రత్యేక PGRS కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. పరిష్కారం కాని అర్జీల విషయంలో సంబంధిత కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని, తద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్